మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష ? !!
ప్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ ఓ కేసులో దోషిగా నిర్దారణ కావడంతో అతనికి ఏడాదిపాటుజైలు శిక్ష విధిస్తూ ఆ దేశం లోని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. గతంలో నిర్వహించి పదవి దృష్ట్యా కొంత వెసులుబాటు కల్పించింది. ఈ మాజీ అధ్యక్షుడు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే ఆయన ఈ శిక్షను అనుభవించ వచ్చు. కాకుంటే ఒక ఎలక్ట్రానిక్ మానిటరింగ్ బెల్టును ధరించాల్సి ఉంటుంది.
సర్కోజీ 2007 నుంచి12 వరకు ఫ్రాన్స్ కు అధ్యక్షుడిగా వ్యవహరించారు, ఇప్పటికీ దేశంలో కన్జర్వేటివ్ సర్కిళ్లలో అపార మైన పలుకుబడి కల్గిన వ్యక్తి. అరవై ఆరు సంవత్సరాల వయస్సు కల్గిన సర్కోజీకి న్యాయస్థానం మరో వెసులుబాటు కూడా కల్పించింది. ఆయనకు తాజా తీర్పు పై అభ్యంతరాలు ఏవైనా ఉంటే మరలా కేసును రివ్యూ చేయమని కోర్టును కోరవచ్చు. 2012 లో జరిగిన ఎన్నికల సమయంలో చేసిన వ్యయం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదనేది ప్రధాన ఆరోపణ. ఎన్నికల సందర్భంగా ఆయన నిర్వహించిన ర్యాలీలు, సమావేశాలు కూడా నిబంధనకు విరుద్దంగానే సాగాయని కోర్టు అభిప్రాయపడింది. ఎన్ని కుయుక్తులు పన్నినాా సర్కోజీ ఓటమి నుంచి తప్పించుకోలేక పోయారు. సోషలిష్ట నేత ఫ్రాన్కోసిస్ ఈయన పై విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. సర్కోజీ ఎన్నిక ప్రచార కర్తగా వ్యవహరించిన బైగ్మెలియన్ అండ్ కో కంపెనీ సభ్యులకు కూడా న్యాయస్థానం శిక్షను విధించింది.