ఈ మ‌ధ్య కొంద‌రికి అనారోగ్యంతో మ‌తిస్థిమితం వ‌చ్చింది : పోతిన వెంక‌ట మ‌హేష్

సీఎం  జగన్మోహన్ రెడ్డి కి కులపిచ్చి లేదని ఎవరైనా కాదనగలరా ..? అంటూ జ‌న‌సేన నేత పోతిన వెంక‌ట మ‌హేష్ వ్యాఖ్యానించారు . క్రిస్టియన్స్ ను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ నామినేటెడ్ పదవుల్లో వారికి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు . నామినేటెడ్ పదవుల్లో వెయ్యికిపైగా పదవులు వారి సామాజిక వర్గానికి కేటాయించడాన్ని కులపిచ్చి అంటారా లేదంటే సామాజిక న్యాయం అంటారా ? అంటూ ప్ర‌శ్నించారు . 

సామాజిక న్యాయం పేరుతో తన సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి .. .. ఈ మధ్య కొంతమందికి అనారోగ్యం వచ్చి ఆపరేషన్ చేయించుకుని మతిస్థిమితం సరిగా లేదు అనుకుంటా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ పోతిన వెంక‌ట మ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: