ఇది 'మేక్ ఇన్ ఇండియా'

ఇది 'మేక్ ఇన్ ఇండియా'
'దేశ రక్షణకు అవసరమైన క్షిపణులను భారత్ ఇంక నుంచి దిగుమతి చేసుకోదు. ఎగుమతి చేస్తుంది.'. ఇది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవలి కాలంలో పదే పదే చెబుతున్న మాట. 'ప్రపంచ దేశాల వారు ఎవరైనా సరే వారికి అవసరం అని కోరితే , ఆ మేరకు భారత్ వాటిని విక్రయిస్తుంది.' అని కూడా ప్రధాని పేర్కొంటున్నారు. మేక్ ఇన్ ఇండియ లో భాగంగా స్వదేశీ తయారీకి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ మక్కువ చూపుతోంది. ఈ క్రమంలో పురుడు పోసుకున్నది ఆకాశ్ క్షిపణి. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. భారత రక్షణ అవసరాలకు అనుగుణంగా తయారైన అస్త్రం. దీనిని సరికొత్తగా ఆధునీకరించారు. అంతే కాదు ఒడిశా రాష్ట్రంలో ఉన్న చాందీపూర్ లో పరీక్షించారు. చాందీపూర్ లో సమీకృత సమీకృత పరీక్షా వేదిక ఉందన్న విషయం అందరికీ ఎరుకే. మానవరహితంగాఈ క్షిపణి ని ప్రయోగించ వచ్చు. ఆకాశంలో నిర్దేశించిన లక్ష్యాలను ఇది అత్యంత సమర్థవంతంగా ఛేదిస్తుంది. ఇప్పటికే భారత అమ్ముల పొదిలో అకాశ్ క్షిపణి ఉంది. తాజా ఆధునీకరించిన ఈ క్షిపణికి ఆకాశ్ ప్రైమ్ గా నామకరణం చేశారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే ఉన్న ఆకాశ్ క్షిపణితో పోలిస్తే ప్రైమ్ లో ఎన్నో ప్రత్యకతలున్నాయి. అత్యంత ఆదునీకరించ బడినది. అత్యంత ఎత్తులో లక్ష్యాలను నిర్దేశించినా ఇది సమర్ధవంతంగా పని చేస్తుంది. అంతే కాదు, వాతావరణ అనుకూలతతో నిమిత్తం లేకుండా కూడా లక్ష్యాన్ని సాధించ గలదు. భారత దేశం లోని సైనికులకు, ఆకాశ్ ను నిర్వహిస్తున్న సైనిక వ్యవస్థల కు నూతనంగా రూపొందించిన ఆకాశ్ ప్రైమ్ ఓ బిగ్ అసెట్ కాగలదు అని డి.ఆర్.డి.ఓ చైర్మన్ సతీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఆకాశ్ ప్రైమ్ విజయవంతం కావడం పై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన హర్షం వెలిబుచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: