మరో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్...?

గనుల సినరేజీ వసూళ్ల బాధ్యతలను ప్రైవేట్ వ్యక్తులకు ఏపీ సర్కార్ అప్పగించాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. సినరేజీ వసూళ్ల నిమిత్తం బిడ్లను పిలిచేందుకు మైనింగ్ శాఖ నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాలను ఆరు ప్యాకేజీలుగా విభజించి బిడ్లను ఆహ్వానించేందుకు సమాయత్తం అవుతున్నది. ఆరు ప్యాకేజీలకి మొత్తంగా సుమారు రూ. 2900 కోట్లుగా రిజర్వ్ ధర గా నిర్ణయించారు.
గనుల తవ్వకం, చెక్ పాయింట్ల వద్ద  వెయింగ్ మిషన్లు, ఈ-పర్మిట్ జారీ, డెలివరీ వంటి పనులను ఇకపై పర్యవేక్షిస్తారు. ఒకటో ప్యాకేజీ కింద శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు ఉంటాయి అని, రెండో ప్యాకేజీ లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉండగా మూడో ప్యాకేజీలో కృష్ణా, గుంటూరు జిల్లాలు, అలాగే నాలుగో ప్యాకేజీ లో ప్రకాశం జిల్లాల ను ఉంచిన గనుల శాఖ... ఐదో ప్యాకేజీలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలను చేర్చింది. ఆరో ప్యాకేజీలో అనంత, కడప, కర్నూలు జిల్లాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: