కేటీఆర్ పిటిష‌న్..రేవంత్ కు షాక్..!

రేవంత్ పై కేటీఆర్ పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ రోజు కేటీఆర్ త‌ర‌పు న్యాయ‌వాది కోర్ట్ లో వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి పై రేవంత్ రెడ్డి ఇష్టానుసారం వాఖ్యలు చేశాడని కేటిఆర్ తరుపు న్యాయవాది వాదించారు. దాంతో సిటీ సివిల్ కోర్టు ఇంజెక్షన్ ఆడర్ ఇచ్చింది. డ్రగ్స్ కేస్ లో... ఈడీ కేసులో కేటిఆర్ పై ఎలాంటి వాఖ్యలు చేయకూడదని ఇంజెక్షన్ ఆర్డర్ సిటీ సివిల్ కోర్టు ఆర్డ‌ర్స్ ఇచ్చింది. 

అంతే కాకుండా ఈ కేసులో రేవంత్ రెడ్డి కి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణను అక్టోబర్ 20 కు వాయిధా వేసింది. ఇదిలా ఉండ‌గా కేటీఆర్ పై రేవంత్ చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఈ రోజు రేవంత్ రెడ్డి ఇంటిని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ముట్ట‌డించారు. దాంతో రేవంత్ ఇంటివ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: