జగన్ ప్రభుత్వంపై రేషన్ డీలర్లు ఫైర్...? సర్వర్ ఫాల్ట్ ఎవరిది అన్నట్టు...?

రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సర్వర్ లో అంతరాయం ఏర్పడటం అధికారులను ప్రజలను చాలా ఇబ్బంది పెడుతుంది. నిన్నటి నుంచీ సమస్య ను పరిష్కరించలేదు అధికారులు. రేషన్ షాపుల వద్ద ప్రజల పాట్లు అన్నీ ఇన్ని కాదు. దీనితో డీలర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు మాట్లాడుతూ... సర్వర్ సమస్య తో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు.
డీలర్లు చేయని తప్పుకు మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు ఆయన. ఇంటింటికీ రేషన్ లో లేని సర్వర్ సమస్య ఇప్పుడే ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రతినెలా ఇలానే ఉన్నా ... అధికారులు స్పందించరా అంటూ మండిపడ్డారు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా.. ఎందుకు సరి చేయడం లేదు అని ప్రశ్నించారు. దీని పై మాకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: