టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. నితిన్ హీరోగా నటిస్తున్న పలు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా వినాయకచవితి సంధర్భంగా మరో సినిమాను మొదలు పెట్టాడు. నితిన్ 31వ సినిమాకు వెంకీ కుడుముల కథను అందిస్తుండగా ఈ సినిమాకు ఎస్ ఆర్ శేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ముహూర్త సన్నివేశానికి ముఖ్య అతిధిగా హాజరైన అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.
ఇక ఈ సినిమాలో నితిన్ కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటించబోతుంది. సాగర్ మహతి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చబోతున్నారు. ఇదిలా ఉండగా వెంకీ కుడుముల లవ్ స్టోరీలు తీయడంలో ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. దాంతో ఆయన మరో కథను నితిన్ కోసం సిద్దం చేయడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను నితిన్ 31 రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి.