అదిరిపోయే ఎంట్రీతో రవి.. బిగ్ బాస్ విన్నర్ అవుతాడా?

Purushottham Vinay
యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లి తెర మీద ఎన్నో సంవత్సరాలుగా ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఎన్నో షోలలో రవి తనదైన స్టైల్ తో ఎంతగానో మెప్పించాడు. అలాగే సంతింగ్ స్పెషల్ లో యాంకర్ గా రవి బాగా పేరు సంపాదించాడు. ఇక ఢీ, పటాస్ లాంటి షోలతో రవి ఒక రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పటాస్ షో గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన కామెడీ టైమింగ్ తో అలానే మంచి గ్రేస్ ఫుల్ డాన్స్ తో బాగా ఎంటర్టైన్ చేశాడు రవి. ఇక హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీస్ కూడా రవిలో ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి డాన్స్, ఆకట్టుకునే అందం, కామెడీ టైమింగ్ ఇలా ప్రతి దాంట్లో రవి తనదైన స్టైల్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక అమ్మాయిల్లో అయితే రవికి మామూలు క్రేజ్ లేదు. అయితే రవి ఇండస్ట్రీకి మంచి హీరో అవ్వాలని వచ్చాడు.కాని ఎన్ని ప్రయత్నాలు చేసిన హీరో అవ్వలేకపోయాడు. ఇప్పటికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నా కాని హీరోగా రవికి ఎలాంటి అవకాశాలు రావడం లేదు.ఇక రవి మరోసారి ఎంటర్టైన్ చెయ్యడానికి బిగ్ బాస్ షోలోకి రాబోతున్నాడు.బిగ్ బాస్ 5 లోకి రవి 19 వ హోస్ మేట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ బిగ్ బాస్ షో ద్వారా తన ప్రతిభతో ప్రేక్షకులని వినోదపరచి బిగ్ బాస్ టైటిల్ గిలిచి హీరోగా అవకాశాలు అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: