బిగ్ బాస్ సీజన్ 5 లో ఎనిమిదవ కంటెస్టెంట్ గా జెస్సీ జశ్వంత్ పడాల ఎంట్రీ ఇచ్చాడు. జశ్వంత్ పడాల మోడల్ గా ఇండస్ట్రీలో ఎంతో పాపులర్ అయ్యాడు. జశ్వంత్ విజయవాడకు చెందిన కుర్రాడు కావడం చెప్పుకోదగ్గ విషయం. తెలుగు వారు మోడలింగ్ లో చాలా తక్కవ మంది రాణించారు. కానీ జెశ్వంత్ తాను మోడల్ గా ఎదగటమే కాక ఎంతో మంది యువకులకు మోడలింగ్ లో శిక్షణ ఇస్తున్నాడని నాగార్జున చెప్పారు. అంతే కాకుండా మోడలింగ్ కష్టమని నాగార్జున జశ్వంత్ పై ప్రశంసలు కురిపించారు.
ఇక జెశ్వంత్ మోడలింగ్ తో పాటు సీరియల్స్ లోనూ నటించినట్టు తెలుస్తోంది. మోడలింగ్ ద్వారా బిగ్ బాస్ లోకి గత సీజన్ లో దివి రాగా..ఈ సీజన్ లో జెస్సీ ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తోంది.ఇక ఇంటి సభ్యులు మాత్రం జెశ్వంత్ ను కొత్తగా చూస్తున్నారు. దానికి కారణం మోడలింగ్ లో పాపులారీటీ సంపాదించిన్పటికీ ప్రేక్షకులకు కంటెస్టెంట్ లకు జశ్వంత్ పెద్దగా పరిచయం లేదు. మరి బిగ్ బాస్ తో పాపులారిటీ సంపాదిస్తారా అన్నది చూడాలి.