రేణూ దేశాయ్ ప్రస్తుతం మళ్లీ ఇండస్ట్రీకి దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. టీవీ షోలలో జడ్జిగా కనిపిస్తున్నరేణూదేశాయ్ ఓ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆ సినిమా గురించి అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ మళ్లీ ఆ తరవాత ఎలాంటి అప్డేట్ లేదు. కానీ రేణూ దేశాయ్ త్వరలో మరికొన్ని సినిమాలలోనూ నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే రేణూ దేశాయ్ ఇన్స్టాగ్రామ్ ను ఎక్కువగా వాడే సెలబ్రెటీలలో ఒకరు. కేవలం ఎంటర్టైన్ మెంట్ కోసం మాత్రమే కాకుండా రేణూ ఇటీవల కరోనా టైం లో తన టీమ్ తో కలిసి ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారు.
అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణూ దేశాయ్ ఎప్పుడు లైవ్ కు వచ్చినా...అభిమానులతో ముచ్చటించినా ఎదురయ్యేది ఒకే ప్రశ్న..అదేంటంటే..అకీరా ఎక్కడ..? ఏం చేస్తున్నారు..అయన ఫోటోలు పెట్టండి. కాగా అలానే ఓ అభిమాని తాజాగా మీరెందుకు అకీరా ఫోటోలను పోస్ట్ చేయడం లేదు అంటూ ప్రశ్నించారు. దానికి రేణూ దేశాయ్ సమాధానం ఇస్తూ....అకీరాకు తన ఫోటోలు పెట్టడం ఇష్టం ఉండదు. నేను నా కొడుకు మాటలను గౌరవిస్తాను. అంటూ సమాధానం ఇచ్చింది.