కథ కంచికి : అత్యాచారమా అంతా అబద్ధం
ఆ ఇద్దరూ చెప్పింది అబద్ధం
ఆ కేసులో ఆరోపణలు అవాస్తవం
గాంధీలో రేగిన కలకలం సుఖాంతం
తాగుడుకు బానిసలు వారు
ఇదీ చిలకలగూడ పోలీసులు తేల్చిన నిజం
గాంధీ ఆస్పత్రి ప్రతిష్టను దిగజార్చే ఘటన ఏదీ జరగలేదు. కానీ వారు కల్లుకు బానిసలు.. వారి చెప్పిందానికి మేం పరిశోధన చేసి తేల్చిందానికి ఏ సంబంధం లేదని పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసు పురోగతి సాధించి, పోలీసుల పరువు నిలిపింది. ఇందులో బాధితులు చేసిన ఆరోపణలే అసత్యాలు అని తేలడం, వీటికి సంబంధించి ఎవిడెన్స్ లు ఏవీ దొరక్కపోవడం, సంబంధిత పరీక్షల ఫ లితాలు కూడా అత్యాచార ఆరోపణలను బలపర్చకపోవడంతో ఎట్టకేలకు ఈ కథ సుఖాంతం అయింది. వివరాలిలా...
అత్యాచారం జరిగిందంటూ సంచలనం రేపిన గాంధీ ఆస్పత్రి కేసు కొలిక్కి వచ్చింది. దీనిపై పోలీసుల పరిశోధనలో విస్తుబోయే నిజా లు వెల్లడయ్యాయి. దీంతో నిందితులు ఎవ్వరన్నది తేలిపోయింది. ఆస్పత్రిలో చేరిన అక్క చెల్లెళ్లు ఇద్దరూ కల్లుకు బానిసలు అని, వారు ఆస్పత్రికి వచ్చిన నాటి నుంచి కల్లు దొరక్క మాససికంగా కల్లోలాలకు లోనై , అనవసర ఆరోపణలు చేశారని తేల్చారు పోలీ సులు. ముఖ్యంగా మూత్ర పిండ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన రోగి చెల్లెల్లు కల్లు దొరక్క ఆస్పత్రి వదిలి పోయి ఎక్కడెక్కడో తిరిగి తమను ముప్ప తిప్పలు పెట్టిందని, ఇందులో ఎటువంటి వాస్తవాలూ లేవని, ఆఖరిని ఆమెను నారాయణ గూడలోని ఓ మెడికల్ షాపు దగ్గర పట్టుకోవడంతో అసలు కథ వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.