క్రికెట్ మక్కాలో హైదరాబాద్ నవాబ్...?

Chakravarthi Kalyan
క్రికెట్ మక్కా లార్డ్స్‌లో భారత జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించింది. మొదటి టెస్టులో తృటిలో విజయాన్ని చేజార్చుకుంది.  భారత జట్టు రెండో టెస్టులో మాత్రం పట్టు వదలకుండా పోరాడింది. వర్షం మ్యాచ్ కి అంతరాయం కలిగించిన భారత జట్టు మాత్రం లార్డ్స్‌ విజయం దిశగా అడుగులు వేసింది.

ఈ మ్యాచ్‌లో  భారత జట్టు విజయంలో హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 94 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన సిరాజ్ అందరికంటే ఎక్కువగా 30 ఓవర్లు బౌలింగ్ చేశాడు. పిచ్ నుంచి అందుతున్న సహకారాన్ని రెండు చేతులు అందిపుచ్చుకున్న యువ బౌలర్ రెండో ఇన్నింగ్స్ లో కూడా చెలరేగిపోయాడు. మరో తొమ్మిది ఓవర్లు ఉండగా కీలక ఆటగాడు జాస్ బట్లర్ ను కీపర్ క్యాచ్ ద్వారా వెనక్కి పంపిన సిరాజ్ అదే ఓవర్లో సీనియర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ ను బౌల్డ్  చేశాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: