పోలీసులకు గుడ్ న్యూస్..ఇకపై వీక్ ఆఫ్.. !

ఏ ఉద్యోగమైనా వీక్ ఆఫ్ లు ఉంటాయి. కానీ పోలీస్ ఉద్యోగం లో మాత్రం వీక్ ఆఫ్ అన్న మాటే ఉండదు. ప్రతిరోజు డ్యూటీలో ఉండాల్సిందే. దాంతో పోలీసులు కుటుంబంతో గడపడానికి అసలు సమయమే ఉండదు. అలాగే విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం ఉండదు. ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడు ప్రభుత్వం పోలీసుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుండి పోలీసులకు కూడా వీక్ ఆఫ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పుట్టినరోజు, పెళ్లి రోజున కూడా సెలవు ఇస్తామని వెల్లడించింది.

ఈమేరకు డీజీపీ శైలేంద్ర బాబు ఉత్తర్వులు జారీ చేశారు.  అంతే కాకుండా తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అయితే ఒకవేళ ఈ సెలవుల్లో ను తప్పక పని చేయాలి వచ్చినట్లయితే ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఇస్తామని తెలిపింది. ఇక తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వార్త తెలిసిన ఇతర రాష్ట్రాల పోలీసులు తమకు కూడా తమిళనాడు ప్రభుత్వం అమలు చేసిన విధంగా వీక్ ఆఫ్ లు ఇవ్వాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: