దేశంలోనే ఆ సౌకర్యం ఉన్న తొలినగరం పూరి !

Chakravarthi Kalyan
ఒడిశాలోని పూరీ నగరం దేశంలోనే రికార్డు సాధించింది. నగరమంతా నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్న మొట్టమొదటి నగరంగా అవతరించింది. ఇప్పుడు పూరీ వాసులందరికీ  సురక్షితమైన తాగునీరు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ నీరు పూర్తిగా సురక్షితమైంది.. నేరుగా వాడుకోవచ్చు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ సుజల్ పథకాన్ని ప్రారంభించారు.

ఒడిశా ప్రభుత్వంఇలా పూరీలో ట్యాప్ నుండి నగర వ్యాప్తంగా 24 గంటల నాణ్యమైన తాగునీటిని అందిస్తూ దేశంలోనే మొదటి స్థానం సాధించింది. పూరి ఇప్పుడు లండన్, న్యూయార్క్, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాల సరసన చేరిందంటోంది ఒడిశా ప్రభుత్వం. ఈ పథకం ద్వారా పూరిలో సుమారు 2.5 లక్షల మంది నివాసితులకు ప్రయోజనం కలుగుతుంది. పూరి మాత్రమే కాదు, మొత్తం ఒడిశా చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు ఒడిశా సీఎం. ప్రతి సంవత్సరం పూరీకి వచ్చే రెండు కోట్ల మంది పర్యాటకులకుకూడా  ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: