ఐపీఎల్‌-14 షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ

Chakravarthi Kalyan
బీసీసీఐ ఐపీఎల్‌-14 ఫేజ్‌-2 షెడ్యూల్‌ ప్రకటించింది. యూఏఈ వేదికగా ఐపీఎల్‌ ఫేజ్‌-2 క్రికెట్‌ మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు యూఏఈలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది. భారత్‌ వేదికగా ఇప్పటికే ఐపీఎల్‌-14వ సీజన్‌లో 29 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మిగతా 31 మ్యాచ్‌లు యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్టు బీసీసీఐ తెలిపింది.

భారత్‌లో కరోనా ఉద్ధృతితో గతంలో వాయిదాపడిన ఐపీఎల్‌-14 తిరిగి యూఏఈలో ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి మధ్య పోరుతో ఈ ఫేజ్‌-2 మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 10న తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగబోతోంది. అక్టోబరు 11న ఎలిమినేటర్‌, 13న రెండో క్వాలిఫయర్‌ జరుగుతాయి. ఇక అక్టోబరు 15న దుబాయ్‌ వేదికగా ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగబోతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: