ఏలూరు కింగ్‌ ఎవరో తేలేది నేడే..!

Chakravarthi Kalyan
ఇవాళ ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఉదయం 8 గంటల నుంచి ఈ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందు కోసం అధికారులు ఏలూరు సీఆర్‌ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు ప్రత్యేక హాళ్లు ఏర్పాటు చేశారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియను మొత్తం రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
 
ఈ మార్చి 10న ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికలు పోలింగ్ జరిగింది. అయితే హైకోర్టు ఆదేశాలతో లెక్కింపు మాత్రం నిలిపేశారు. మళ్లీ హైకోర్టు ఆదేశించడంతో ఇవాళ ఓట్లు లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నారు. ఏలూరు కార్పొరేషన్‌లో మొత్తం 50డివిజన్లు ఉండగా 3 ఇప్పటికే  ఏకగ్రీవం అయ్యాయి. మార్చి 10 న 47డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. వైసీపీ 47, తెలుగుదేశం 43స్థానాల్లో పోటీ చేసాయి. జనసేన 19, భాజపా14, స్వతంత్రులు 39 స్థానాల్లో పోటీ చేశారు. వీరి భవితవ్యం ఇవాళ తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: