జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని వరదల కంట్రోల్ రూం ను ఈ రోజు నగర మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ఈ సంధర్భంగా మేయర్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం కు ఇప్పటివరకు మొత్తం 295 కాల్స్ వచ్చాయని చెప్పారు. డయల్ 100, మై జీహెచ్ఎంసీ యాప్ తో కూడా కంప్లైంట్స్ ఇవ్వొచ్చని మేయర్ చెప్పారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నంబర్ 040 23111- 1111 అని అవసరమైనవాళ్లు కాల్స్ చేయాలని అన్నారు. ఎలాంటి ఇబ్బంది ఈ నంబర్ కు కాల్ చేయొచ్చన్నారు. నగరంలో నీటి నిల్వల పైనే ఎక్కువ పిర్యాదులు వస్తున్నాయని అన్నారు.
ఇది నా నెంబర్ ఈ నెంబర్ కు కూడా ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు 97044 44053...అంటూ తన ఫోన్ నంబర్ ను కూడా మేయర్ ఇచ్చారు. ఇంకా గ్రేటర్ లో కొన్ని ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉన్నాయని... ముంపు ప్రాంత వాసులను జీహెచ్ఎంసీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని మేయర్ తెలిపారు. వర్షాల తరువాత రోడ్లు మరమ్మతులు చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు. నగరంలో 3900 పాట్ హాల్స్ పూడ్చివేసినట్టు స్పష్టం చేశారు.