నీటి గొడవ తేలలేదుగా.. మరో ఏడాది పెంచేశారు..!

Chakravarthi Kalyan
కృష్ణా ట్రైబ్యునల్ కాల పరిమితిని కేంద్రం మరో ఏడాది  పాటు పొడిగించింది. కృష్ణానదీ జలాల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఈ ట్రైబ్యునల్‌ను కేంద్రం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర జల్‌ శక్తి శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2021 ఆగస్టు 1 నుంచి మరో ఏడాది కాలపరిమితిని పొడిగించారు.

ఈ కృష్ణా ట్రైబ్యునల్‌ను 2004 ఏప్రిల్‌ 2న కేంద్రం ఏర్పాటు చేసింది. అప్పట్లో 4 రాష్ట్రాల కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య జలాల పంపిణీకి ఈ కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటైంది. 2014లో ఉమ్మడి ఏపీ విభజనతో కృష్ణానదిపై ఆధారపడిన రాష్ట్రాల సంఖ్య ఐదుకు చేరింది. ట్రైబ్యునల్ ఏర్పాటైనా ఇంకా జలాల పంపిణీ కొలిక్కి రాకపోవడంతో పొడిగింపు తప్పలేదు. కృష్ణా నదీ జలాల విషయంలో వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పొడిగింపు ప్రాధాన్యత సంతరించుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: