జమ్ము కాశ్మీర్ లోని పుల్వామా టౌన్ లో ఈ రోజు ఉగ్రవాదులు మరియు జవాన్ల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది . ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే ఇద్దరు టెర్రరిస్టులు మృతిచెందారు . అంతేకాకుండా పాకిస్తాన్ ఎల్ఈటీ కమాండర్ ఐజాజ్ అలియాస్ హుజారియా కూడా మృతి చెందారు . ఈ విషయాన్ని కశ్మీర్ ఐజీపీ మీడియాకు వెల్లడించారు. ఇప్పటికీ ఇంకా సైనికులు ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి .
ఇదిలా ఉండగా ఈ మధ్య పుల్వామాలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయి . రీసెంట్ గా బీజేపీ కౌన్సిలర్ ను ఉగ్రవాదులు హతమార్చారు . అనంతరం జవాన్లు ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించి ఉగ్రవాదులను హతమార్చారు . ఇప్పుడు తాజాగా ఈ రోజు కూడా పోలీసులు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పుల్వామాలో భారీగా జవాన్లు మోహరించారుు .