పాకిస్థాన్ లో ఫోర్త్ వేవ్.. ?

ప్రపంచవ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్ మోగిస్తోంది. కొన్ని దేశాల్లో ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతుండగా కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ ప్రారంభం కాబోతుంది. అయితే పాకిస్తాన్ లో ఇప్పుడు ఏకంగా ఫోర్త్ వేవ్ వస్తుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దానికి కారణం దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో ఫోర్త్ వేవ్ మొదలైందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

కరోనా ఆంక్షలను సడలించడం, పర్యాటకులకు అనుమతి ఇవ్వడం, కరోనా నిబంధనలకు గాలికి వదిలేయడం కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చాయని ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో 9,73,824 కరోనా కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 22,582 మంది కరోనాతో మృతిచెందారు. ఇక ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మొత్తం పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. దేశంలో కావలసిన వైద్య సదుపాయాలను సమకూర్చుకుంటుంది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: