చిల్డ్రన్ పార్క్ లాంటి ఐసోలేషన్.. ఎక్కడంటే.. ?

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పడుతుందని అనుకునే లోపు థర్డ్ లైవ్ ముప్పు పంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మూడవ వేవ్ ప్రభావం పిల్లల పైనే ఉంటుందని చెబుతున్నారు. దాంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. పిల్లల కోసం అన్ని రాష్ట్రాలు ఐసోలేషన్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో పిల్లల కోసం ఒక ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు.

రాంచి జిల్లాలో ఏర్పాటుచేసిన ఈ ఐసోలేషన్ సెంటర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సెంటర్ లో పిల్లలకు ఆడుకోవడానికి ఆటవస్తువులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆస్పత్రి గోడలను కార్టూన్స్ పెయింటింగ్ తో నింపి వేశారు. బెడ్స్ మధ్యలో పిల్లలకు ఎంతో ఇష్టమైన టామ్ అండ్ జెర్రీ, ఇతర చిత్రాలను ఉంచారు. ఈ సెంటర్ లో కేవలం సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్లకు మాత్రమే చికిత్స అందించనున్నట్టు వైద్యాధికారులు వెల్లడించారు. అందువల్ల 20 బెడ్లతో మాత్రమే ఈ ఐసియు ను ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: