వ్యాక్సిన్ వేయించుకున్నారా.. అక్కడ 50% డిస్కౌంట్!
ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ మీద అవగాహన కల్పించి, వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అందరూ భావించడం కోసం తమిళనాడులోని మధురైలో ఉన్న ఒక సెలూన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేమిటి అంటే covid 19 వ్యాక్సిన్ వేయించుకున్నట్లు సర్టిఫికెట్ తో వచ్చిన అందరు కస్టమర్లకు 50% డిస్కౌంట్ అందిస్తోంది సదరు సెలూన్. సెలూన్ యజమాని కార్తికేయన్ మాట్లాడుతూ వ్యాక్సిన్ గురించి అవగాహన పెంచడానికి మేము ఈ 50 శాతం ఆఫర్ ఇస్తున్నామని, మూడవ దశ రాకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.