ఏపీలో నేడే మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్..ఒక్క‌రోజే.. !

క‌రోనా సెకండ్ వేవ్ నేర్పిన గుణ‌పాటంతో కేంద్రం, రాష్ట్రాలు వ్యాక్సినేష‌న్ ను ష‌ర‌వేగంగా జ‌రుపుతున్నాయి. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్ప‌త్రుల ద్వారా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ల‌ను నిర్వహిస్తూ అర్హులంద‌రికీ వ్యాక్సిన్ లు వేస్తున్నాయి. ఇక ఈ రోజు ఆంధ్ర‌ప్ర‌దేశ‌లో ఏకంగా 8ల‌క్ష‌ల మందికి ఒకేరోజు వ్యాక్సిన్ లు వేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

గ్రామ‌సచివాల‌యాలు, ఆర్బీకే స్థాయిల్లో వ్యాక్సిన్ లు వేసేందుకు ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఇక ఈ రోజు రిజిస్ట్రేష‌న్ చేసుకోకుండా వ‌చ్చిన వారికి ఆధార్ కార్డ్ ప్రూఫ్ చూపిస్తూ కూడా వ్యాక్సిన్ వేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈ మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ లో 45 ఏళ్లు దాటిన వారికి ఫ‌స్ట్ సెకండ్ డోస్ లో ఏదైనా....అంతే కాకుండా పిల్ల‌ల త‌ల్లుల‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఆదేశించింది. ఇక గ‌తంలో ఏపీ ఒకేరోజు 6.28 లక్షల మందికి వ్యాక్సిన్ లు వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: