పెట్రో మంట కొనసాగుతూనే ఉంది. పెట్రోల్ ధరలు కొండెక్కి కూర్చోవడంతో సామాన్యుడిపై భారం పడుతోంది. పెట్రోల్ ధరలు పెరడటం వల్ల రవాణా రంగం కుంటి నడక నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ మంట మండుతూనే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రవారం నాటి పెట్రోల్ ధరలు పరిశీలించినట్టయితే.....తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.48 గా ఉండగా వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.03 గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో రూ. 98.48, కరీంనగర్‌లో రూ. 98.63, ఖమ్మంలో రూ. 98.54 గా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పెట్రోల్ ధరలు చూసినట్లయితే...విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 100.89 ఉండగా....విజయనగరంలో రూ. 100.04, గుంటూరు జిల్లాలో రూ. 100.89, విశాఖపట్నంలో రూ. 99.90, కృష్ణా జిల్లాలో రూ. 100.70 గా ఉన్నాయి.