ఢిల్లీ వరుస విజయాలకు చెక్..నితీశ్ రానా అదరహో..!

Lokesh
కోల్​కతా నైట్​రైడర్స్ ఊపిరి పీల్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్​పై 59 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకుంది. అబుదాబి వేదికగా శనివారం జరిగిన మ్యాచ్​లో లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ విఫలమైంది. దీంతో ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేయగలిగింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన కోల్​కతా.. ప్రారంభంలో 42 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. శుభ్​మన్ గిల్(9), రాహుల్ త్రిపాఠి(13), దినేశ్ కార్తిక్(3) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం వచ్చిన నరైన్.. ఓపెనర్ నితీశ్ రానాతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

క్రీజులో కుదురుకున్న తర్వాత వీరిద్దరూ బౌండరీల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే నాలుగో వికెట్​కు 115 పరుగులు జోడించి, నరైన్(32 బంతుల్లో 64) ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ మోర్గాన్​(17)తో కలిసిన నితీశ్ రానా.. కాసేపు ధనాధన్ బ్యాటింగ్ చేసి 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు.​ దీంతో నిర్ణీతో ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది కోల్​కతా. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్, స్టోయినిస్, రబాడ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: