బ్రేకింగ్ : చైనా మరో దురాగతం.. అరుణాచ‌ల్‌లో ఐదుగురి అపహరణ?

Edari Rama Krishna
గత కొంత కాలంగా భారత్ పై చైనా విషం కక్కుతూనే ఉంది.  ఇటీవల భారత సైనికులను 21 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే.  ఓ వైపు శాంతి చర్చలకు తెరలేపుతూనే మరోవైపు దొంగ దెబ్బ తిస్తూ వస్తుంది. తాజాగా మరో కొత్త విష‌యం వెలుగులోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఐదుగురు స్థానికుల‌ను చైనా బలగాలు అపహరించినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్ ఆరోపించారు.


 అయితే ఇలాంటి చర్యలు గతంలో కూడా జరిగాయని.. ఇక్కడి వారికి అసలు రక్షణ ఉందా లేదా అని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు  ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాస్కోలో చైనా, ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ‌ మంత్రుల‌తో స‌మావేశం కొన‌సాగుతున్న స‌మయంలోనే ఇది జరిగింద‌న్నారు. ఇలా చేయ‌డంవ‌ల్ల‌ చైనా సైన్యం త‌ప్పుడు సంకేతాల‌ను పంపిస్తున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: