ఏపీ లాయర్లకు జగన్ సర్కార్ శుభవార్త...?
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని లాయర్లకు శుభవార్త చెప్పారు. ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులు విడుదల చేస్తూ జగన్ సర్కార్ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. మార్చి నుంచి జూన్ వరకు మూడు నెలలకు జగన్ సర్కార్ రూ.2.91 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 5,832 మంది జూనియర్ న్యాయవాదుల బ్యాంక్ ఖాతాల్లో నేడు నగదు జమ కానుంది. ప్రభుత్వం నిధులను విడుదల చేయడం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ న్యాయవాదులు న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకోవడానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్ వైయస్సార్ లా నేస్తం పథకానికి శ్రీకారం చుట్టారు. గతేడాది డిసెంబర్ 3న ఈ పథకం జగన్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ప్రతి నెలా 5,000 రూపాయల చొప్పున మూడు సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వం నగదును అర్హులైన లాయర్ల ఖాతాలలో జమ చేయనుంది.