సీఎం కేసీఆర్ కనబడుట లేదు.... భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు...?
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేడు మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీపై, ఆ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఓ డమ్మీ మంత్రి అని ఆయనకు ఏమీ తెలియదని వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ శాఖ మంత్రికి సీఎం కేసీఆర్ కు సేవ చేయడం మాత్రమే తెలుసని అన్నారు. విద్యుత్ శాఖపై మంత్రికి పట్టు లేదని వ్యాఖ్యలు చేశారు. వారం రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడుటలేదని భట్టివిక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు అంతకంతకూ పెరుగుతున్నాయని... విద్యుత్ బిల్లులు తగ్గించాలని అధికారుల ద్వారా సీఎం దృష్టికి తీసుకువెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ బిల్లులు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేశారు.