అసోంలో వరద భీభత్సం.... పెరుగుతున్న మృతుల సంఖ్య....?

Reddy P Rajasekhar

అసోం రాష్ట్రంలో వరద భీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలో మరో ఇద్దరు చనిపోవడంతో మృతుల సంఖ్య 37కు చేరింది. ఈ వరదల వల్ల రాష్ట్రంలోని 17 జిల్లాల్లోని 6,00,000 మంది ప్రభావితమయ్యారు. ప్రస్తుతం ఏడు జిల్లాల్లో మాత్రం పరిస్థితి మెరుగుపడిందని అధికారులు చెబుతున్నారు. మోరిగావ్, టిన్సుకియా, ధుబ్రీ, నాగావ్, నల్బరి, బార్పేట, ధెమాజీ, ఉదల్‌గురి, గోల్‌పారా, దిబ్రుగర్ జిల్లాల్లో అధిక సంఖ్యలో మరణాలు సంభవించాయని సమాచారం. 
 
లఖింపూర్, శివసాగర్, బొంగైగావ్, హోజాయ్, ఉడలగురి, మజులి మరియు పశ్చిమ కార్బి ఆంగ్లాంగ్ జిల్లాల్లో వరద పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. వరదల కారణంగా 8,91,897 వివిధ పెంపుడు జంతువులు, 8,01,233 పౌల్ట్రీలు ప్రభావితమయ్యాయని తెలుస్తోంది. ప్రధాని మోదీ అస్సాం సీఎం సర్బనాడ సోనోవాల్‌తో మాట్లాడి వరద పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: