గురువే అసలైన మార్గదర్శి : పవన్ కళ్యాన్

Edari Rama Krishna

గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః'

 

ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురుపూర్ణిమ' 'వ్యాసపూర్ణిమ' అని అంటారు. గురోః ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే అని గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా, పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం. సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. పూర్వ కాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యా బుద్ధులు నేర్చుకునేవారు. ఆశ్రమంలోనే ఆయనతోపాటు నివశించేవారు.

 

తాజాగా నేడు గురు పౌర్ణమి సందర్భంగా నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పలు విషయాలను వెల్లడించారు. గురువే జీవిత మార్గదర్శి అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. విజ్ఞాన సముపార్జనకు గురువే మూలమని పవన్ కల్యాణ్ చెప్పారు. గురువే జీవిత మార్గదర్శి అని, అటువంటి గురువులను ప్రత్యేకంగా గౌరవించాలని పవన్ కల్యాణ్ తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: