తాప్సీ ఇంటికి 36,000 రూపాయల కరెంట్ బిల్లు.... అవాక్కైన హీరోయిన్ ?

Reddy P Rajasekhar

ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా కరెంట్ బిల్లుల గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని చోట్లా మూడు నెలల కరెంట్ వాడకాన్ని కలిపి ఒకటే బిల్లును ఇస్తుండటంతో భారీ మొత్తంలో కరెంట్ బిల్లులు వస్తున్నాయి. శ్లాబ్‌లు మారి ప్రతి ఒక్కరికీ భారీగా చార్జీలు పడుతున్నాయి. తాజాగా హీరోయిన్‌ తాప్సీ ఇంటికి 36,000 కరెంట్ బిల్లు వచ్చింది. సాధారణ రోజుల్లో వచ్చే బిల్లు కంటే 10 రెట్లు అధికంగా బిల్లు వచ్చిందని చెప్పారు. 
 
కరెంట్ బిల్లు చూసి అవాక్కయ్యానని వారానికో రోజు వెళ్లి వచ్చే ఇంటికి పెద్దమొత్తం కరెంట్‌ బిల్లు రావడం ఏంటని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మామూలు రోజుల్లో ఇంట్లో ఎవరు ఉండరని పేర్కొన్నారు. మూడు నెలల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో కరెంట్‌ బిల్లు పెరగడానికి కారణం ఏంటి? ఏ రకమైన బిల్లును వసూలు చేస్తున్నారని అధికారులను ప్రశ్నిస్తూ ఆమె ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: