వినియోదారులే... వ్యాపారులు.. డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

Lokesh

 

హైదరాబాద్‌ నగరంలో డ్రగ్స్  ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఇంతకు మునుపు నైజీరియన్లే సరఫరా ముఠాలుగా ఉండేవారు. నిఘా పెరగడం వల్ల వారంతా తెరవెనక్కి వెళ్లారు. డ్రగ్స్‌ వినియోగదారులకు అదనపు ఆదాయం ఆశచూపి వారితోనే విక్రయాలు చేయిస్తున్నట్లు ఇటీవల విచారణలో తెలిసింది. కరోనా ప్రభావంతోనూ గుట్టుచప్పుడు కాకుండా నగరానికి మాదక ద్రవ్యాలను తరలించి సాధారణ రోజులు కంటే రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు.ఈ నేపథ్యంలో మే 14న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న యూసుఫ్‌గూడ నివాసి సాయి శ్రీనివాస్‌ను అబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్​ ఏఈఎస్‌ అంజిరెడ్డి బృందం అదుపులోకి తీసుకుంది.

 


 వారి నుంచి 2.83 కిలోల చరాస్‌తో పాటు గంజాయి ఆకుల నుంచి తీసిన 25 ఎంఎల్‌ హషిష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందుతుడు తొలుత గంజాయికి బానిసై.. అనంతరం వ్యాపారి అవతారమెత్తాడు. అంతలోనే అధికారులకు చిక్కాడు.అనంతరం విశ్వసనీయ సమాచారంతో ఈ నెల 21న ఎస్‌ఆర్‌నగర్‌ సమీపంలోని మధురానగర్‌లో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 


 
 
వారి వద్ద నుంచి 105 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్‌, 25 ఎంఎల్‌ హషిష్‌ ఆయిల్‌, 250 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
మధురానగర్‌కు చెందిన భరత్‌ టుక్రాల్‌, బల్కంపేటకు చెందిన రాణాప్రతాప్‌, బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌ బస్తీకి చెందిన ఫెరోజ్‌ అహ్మద్‌లు మత్తుకు బానిసలై.. ఇతరులకు చేరవేసే క్రమంలో అధికారులకు చిక్కారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఏడు మొబైల్‌ ఫోన్‌లను పరిశీలించగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: