ఎల్లో మీడియా ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూసింది... విజయసాయి సంచలన వ్యాఖ్యలు....?
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా పార్క్ హయత్ లో నిమ్మగడ్డ, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి మధ్య జరిగిన భేటీ గురించి ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎల్లో మీడియా పార్క్ హయత్ భేటీ వార్తలను తొక్కిపెట్టిందని అన్నారు. ఈ భేటీ గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం కాదని ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూసిందని పేర్కొన్నారు. ఎల్లో మీడియా ‘కొక్కొరోక్కో’ అంటేనే తెల్లారే రోజులు పోయాయని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని 9 కోట్ల మంది ఆ ముగ్గురి రహస్య కలయికను చూసారని అన్నారు. ఎల్లో మీడియా చూపించకపోయినంత మాత్రాన సోషల్ మీడియా ఊరుకోదు కదా అని పేర్కొన్నారు. చంద్రబాబు వెన్నుపోట్లతో ఏదైనా సాధించవచ్చని అనుకుంటాడని.... పార్క్ హయత్ సాక్షిగా నిమ్మగడ్డ ఇలా దొరికిపోతాడని ఊహించి ఉండడని అన్నారు.
పార్క్ హయత్ భేటీ వార్తలను ఎల్లో మీడియా తొక్కిపెట్టింది. అంతగా పట్టించుకోదగిన ఘటన కాదని ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూసింది. వాళ్లు ‘కొక్కొరోక్కో’ అంటేనే తెల్లారే రోజులు పోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని 9 కోట్ల మంది ఆ ముగ్గురి రహస్య కలయికను చూసారు. సోషల్ మీడియా ఊరుకోదు కదా. — Vijayasai reddy v (@VSReddy_MP) June 25, 2020