సూసైడ్ నోట్ రాసి పూడూరు సర్పంచ్ ఆత్మహత్య.... మనోవేదనతో....?
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గత కొంతకాలంగా మనో వేదన, అనారోగ్యంతో బాధ పడుతున్న పూడూరు మండలం కొత్తపల్లికి చెందిన కావలి ఆనందం(35) ఉరి వేసుకొని చనిపోయారు. మొన్న రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసిన ఆనందం నిన్న ఉదయం గది తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులను తీసి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు.
ఆయన రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని... మానసికంగా వేదనకు గురై తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆనందం సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. మృతుడి సోదరుడు శ్రీహరి గత కొంతకాలంగా తన సోదరుడికి ఆరోగ్యం సహకరించడం లేదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, మండలంలోని పలువురు సర్పంచ్‌లు ఆనందం మృతికి సంతాపం తెలిపారు.