బ్రేకింగ్ : కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన నైజీరియా.... కానీ.....?

Reddy P Rajasekhar

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేసే వ్యాక్సిన్ ను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. నైజీరియన్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను కనిపెట్టినట్టు నైజీరియన్ యూనివర్సిటీలు ప్రకటించాయి. కరోనాకు వ్యాక్సిన్ ను కనిపెట్టడం కోసం ప్రపంచ దేశాలు విసృతంగా అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 13 వ్యాక్సిన్లను మనుషులపై ప్రయోగిస్తున్నారని చెబుతోంది. 
 
నైజీరియా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను కనిపెట్టినప్పటికీ ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రావడానికి 18 నెలల సమయం పడుతుందని సమాచారం. వ్యాక్సిన్ పై ఇప్పటికే చాలా ప్రయోగాలు చేశామని..... అంకితభావానికి వచ్చిన ఫలితమే ఇది అని ప్రీసియస్ కార్నర్ స్టోన్ వర్సిటీ ప్రొఫెసర్ జూలియస్ ఒలోక్ చెప్పారు. శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ ను కనిపెట్టడానికి ఎంతో కష్టపడ్డారని అన్నారు. అయితే ఈ వ్యాక్సిన్ పై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ అవసరమని... వైద్య అధికార వర్గాల నుంచి అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: