బ్రేకింగ్ : జగన్ సర్కార్ కీలక నిర్ణయం.... రాష్ట్రంలో రోజుకు 30వేల కరోనా టెస్టులు...?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 22,000 కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా ఆ సంఖ్యను 30,000కు పెంచుతామని చెబుతోంది. ప్రభుత్వం కరోనా పరీక్షల కోసం రోజుకు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఈ మేరకు తెలిపారు. 
 
ఏకకాలంలో 40,000 మందికి వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందులో 20,000 పడకలు ఆక్సిజన్ పడకలేనని అన్నారు. కరోనా తీవ్రత తక్కువ ఉన్నవారికి ఇంట్లోనే వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి పెడతామని... వాళ్లను కాపాడుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: