బ్రేకింగ్ : పాక్ కు భారీ షాక్... ప్రత్యేక దేశం దిశగా సింధ్...?
పాకిస్తాన్ భారత్ శత్రు దేశం. భారత్ పాక్ తో మిత్రుత్వంతో మెలగాలని ప్రయత్నించినా పాక్ మాత్రం ఎల్లప్పుడూ కవ్వింపు చర్యలకు పాల్పడి శత్రు దేశంగా మారింది. ఇప్పటికే బలూచిస్థాన్ ప్రాంతంలో ఘర్షణలు చోటు చేసుకుంటుండగా సింధ్ ప్రాంతంలో కూడా అలాంటి ఘర్షణలే పునరావృతం అవుతున్నాయి. దీంతో పాక్ దేశం మూడు ముక్కలు కానుందా....? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఉగ్రవాదులకు పుట్టినిళ్లు అయిన పాక్‌లో ప్రస్తుతం వరుసగా బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. మొన్న ఇస్లామాబాద్‌లో రెండు పేలుళ్లు జరగగా శుక్రవారం రోజు సింధ్ ప్రావిన్స్‌లో సింధ్ రేంజర్స్ లక్ష్యంగా దాడులు జరిగాయి. తాజాగా సింధుస్థాన్ రెవెల్యూషన్ ఆర్మీ దాడులకు పాల్పడినట్లు కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం పాక్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ప్రత్యేక దేశాల ఏర్పాటుకు మిలిటెంట్ ఉద్యమాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.