తమిళనాడులో జగనన్నకు జై కొట్టిన విజయ్ అభిమానులు... ఏం జరిగిందంటే...?

Reddy P Rajasekhar

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజా సంక్షేమ పాలనతో దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. పొరుగు రాష్ట్రంలోని తమిళ ప్రజలు జగన్ పాలనను గమనిస్తూ వస్తుండటంతో పాటు అక్కడి మీడియాలో నేటికీ జగన్ ను పొగుడుతూ కథనాలు వెలువడుతున్నాయి. ఇదే సందర్భంలో తమిళ నటుడు విజయ్ అభిమానులు జగన్ ఫోటోలతో వాల్ పోస్టర్లను అతికిస్తున్నారు. 
 
తమిళనాడులో వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో "ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలా విజయ్‌ ఘనవిజయం సాధించి తమిళనాడును పాలించేందుకు రానున్నారు" అనే నినాదంతో వాల్ పోస్టర్లను అతికించి అతనికి శుభాకాంక్షలు తెలిపారు. చెన్నై, మధురై నగరాలలో ఇలాంటి వాల్ పోస్టర్లు వెలిశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: