చంద్రబాబు ఫెయిలైన సీఎం... విజయసాయి సంచలన వ్యాఖ్యలు....?

Reddy P Rajasekhar

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఫెయిలైన సీఎం అని... ఆయనకు మీడియాను మేనేజ్ చేయడం మాత్రమే తెలుసని అన్నారు. కాగ్ నివేదికల ద్వారా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినా నిధులను ఖర్చు చేయలేదంటూ విమర్శలు చేశారు. భారీ స్థాయిలో అప్పులు తీసుకుని చంద్రబాబు ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టాడని అన్నారు. 
 
చంద్రబాబు అప్పులు చేసుకున్న మొత్తాన్ని అనవసరమైన వాటి కోసం ఖర్చు చేశారని ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఆ అప్పులను చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. నిన్న కాగ్ 2017 - 2018 సంవత్సరంతో పాటు అంతకుముందు సంవత్సరాల బడ్జెట్లో చేసిన కేటాయింపులను, తర్వాత చేసిన ఖర్చులను బయట పెట్టింది. చంద్రబాబు గొప్పల కోసం కేటాయింపులు చేసి ఖర్చులు చేయడంలో మాత్రం విఫలమయ్యారని కాగ్ నివేదికలో స్పష్టంగా బయటపడింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: