కరోనా కట్టడిలో తెలంగాణ సర్కార్ చేతులెత్తేసింది.... ప్రభుత్వంపై చాడ వెంకటరెడ్డి విమర్శలు...?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేశాయని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయని విమర్శలు చేశారు. 
 
వైద్యులు, జర్నలిస్ట్‌లు, పారిశుధ్య కార్మికులు ఎక్కువగా కరోనా భారీన పడుతూ ఉండటం బాధాకరం అని అన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పీపీఈ కిట్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గచ్చిబౌలిలో కారోనా ఆస్పత్రిని ఇంకా ఎందుకు ప్రారంభించలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారు. నియంత్రిత పంటలు సాగు చేస్తేనే రైతుబంధు ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పడం దుర్మార్గపు చర్య అని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల కోతపై తెచ్చిన జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: