బిగ్ బ్రేకింగ్ : టీడీపీకి మరో షాక్.... మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్ట్.... ?

Reddy P Rajasekhar

ఈరోజు ఉదయం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని శంషాబాద్ లో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. ఏపీ ఆర్టీఏ అధికారులు ప్రభాకర్ రెడ్డి నకిలీ పత్రాలతో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారని చేసిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఆర్టీఏ అధికారులు 154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. వాహనాలకు సంబంధించిన ఫేక్‌ ఎన్‌ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జేసీ ట్రావెల్స్ పై నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి 24 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటివరకు 27 కేసులు నమోదయ్యాయి. జఠాధర, గోపాల్ రెడ్డి కంపెనీల పేర్లతో అశోక్ లేలాండ్ స్క్రాప్ అమ్మినట్లు కూడా ఆరోపణలు వినిపించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: