రేపే "జగనన్న చేదోడు" పథకం ప్రారంభం !!

Surya

 

కరోనా కష్టకాలం లో నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తాజాగా   "జగనన్న చేదోడు" పథకం పేరిట పేద మరియు మధ్య తరగతి ప్రజలకు సహాయ చేయనున్న్డు వైఎస్ జగన్. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు ఆంధ్రా ప్రదేశ్ లో జోరుగా కొనసాగుతున్నాయి.

 

వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌(దర్జీ) అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం "జగనన్న చేదోడు" పథకం ను ప్రారంభించనున్నారు. రేపే "జగనన్న చేదోడు" పథకం ప్రారంభం. షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేయనుంది.ఈ పథకంలో క్రింద  మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: