మరికాసేపట్లో చైనా - భారత్ లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు.... ఉద్రిక్తతలు తగ్గించడానికి భారత్ ఏం చేయనుందంటే..?
చైనా భారత్ దేశాల మధ్య గత కొంతకాలంగా సరిహద్దు వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ చైనా అధికారుల మధ్య మరికాసేపట్లో చర్చలు జరగనున్నాయి. భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరపున ఆర్మీ కమాండర్ లూ లెన్ చర్చల్లో పాల్గొననున్నారు. సరిహద్దు విబేధాలను వివాదాలుగా మారనీయరాదని ఇరుదేశాలు ఇప్పటికే నిర్ణయించాయి.
తూర్పు లఢఖ్ లోని వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర జరిగిన ఘర్షణ అనంతరం చైనా భారత్ దేశాలు భారీగా బలగాలను మోహరించాయి. భారత్ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు నిర్దిష్ట ప్రతిపాదనలు చేయనుందని సమాచారం అందుతోంది. యధాతథ స్థితిని తీసుకువచ్చేందుకు ఇరుదేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.