కియా పరిశ్రమలో కరోనా కలకలం... ఉద్యోగికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో...?
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రముఖ కంపెనీల యాజమాన్యాలను సైతం భయపెడుతోంది. తాజాగా తాజాగా అనంతపురంలోని కియా పరిశ్రమలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పరిశ్రమలోని బాడీ షాప్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా నిర్ధారణ కావడంతో పరిశ్రమలో పని చేసే సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. బాధితుడు తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.
కరోనా సోకిన వ్యక్తిని కియా పరిశ్రమ నుంచి అనంతపురం ఎస్కేయూ క్వారంటైన్‌కు తరలించారు. కియా పరిశ్రమ ప్రతినిధుల నుంచి ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడింది. సిబ్బందిలో ఒకరికి కరోనా నిర్ధారణ కావడంతో ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించి అనంతరమే విధుల్లోకి తీసుకోవాలని కియా పరిశ్రమ యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు ఏపీలో ఈరోజు 98 కరోనా కేసులు నమోదయ్యాయి.