పుల్వామాలో ఎంకౌంటర్... ముగ్గురు ఉగ్రవాదులు హతం..?
పుల్వామా లో భద్రత దళాలు ఉగ్రవాదుల మధ్య ఎప్పుడూ కాల్పులు జరుగుతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు అక్కడ వాతావరణం మొత్తం హాట్ హాట్ గానే ఉంటుంది. ముఖ్యంగా ఉగ్రవాదులను ఎక్కువ మొత్తంలో భద్రత దళాలు పుల్వామా ప్రాంతంలోనే మట్టి పెడుతూ ఉంటాయి. తాజాగా మరోసారి పుల్వామా లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఇక ఈ ఈ ఘటనలో ఏకంగా ముగ్గురు ఉగ్రవాదులను కాశ్మీర్లో హతం చేశాయి భద్రత దళాలు . కాగా పుల్వామా లో ఈ మధ్య కాలంలో వరుసగా ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేస్తున్న విషయం తెలిసిందే.