మోదీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా.... ట్విట్టర్ వేదికగా కపిల్ సిబాల్ విమర్శలు...?

Reddy P Rajasekhar

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై మరోమారు విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ " పీఎం కేర్స్ ఫండ్స్ నుంచి ఎంత డబ్బు ఇచ్చారో మాకు చెప్పగలరా?" అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పాలని మోదీని తాను అభ్యర్థిస్తున్నానని అన్నారు. కరోనా విజృంభణ వల్ల లాక్ డౌన్ ప్రకటించడంతో చాలా మంది వలస కూలీలు మరణించారని చెప్పారు. 
 
వలస కార్మికులలో కొందరు రోడ్లపై నడుస్తున్న సమయంలో మరణించారని... మరికొందరు రైళ్లలో మరణించారని, మరికొందరు ఆకలితో మరణించారని మోదీ సర్కార్ పై విమర్శలు చేశారు. కపిల్ సిబాల్ మోదీ సర్కార్ పై విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో లాక్ డౌన్ విషయంలో, రేషన్ విషయంలో మోదీపై కపిల్ సిబాల్ విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: