గ‌వ‌ర్న‌ర్ నియామ‌కం చెల్ల‌దంటే బాబోరు నియ‌మించిన నిమ్మ‌గ‌డ్డ ప‌ద‌వి చెల్లుబాటెట్టా..?

Reddy P Rajasekhar

ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ నిమ్మగడ్డ కేసు విషయంలో హైకోర్టు తీర్పుపై మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు విషయంలో సుప్రీంకు వెళతామని ఆయన అన్నారు. ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ నియామకం చెల్లనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ ను ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ స్వీయ నియామకం చెల్లదని అన్నారు. 
 
గవర్నర్ నియామకం చెల్లదంటే అప్పటి సీఎం చంద్రబాబు నియమించిన నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదని అన్నారు. ఇప్పటికే స్టే ఇవ్వాలను ప్రభుత్వం హైకోర్టును కోరిందని... సుప్రీంకు వెళుతున్నామని ఆయన చెప్పారు. కోర్టు తీర్పును చాలా మంది ప్రభుత్వానికి చెంపపెట్టు అని భావిస్తున్నారని... తీర్పును గెలుపుగానో ఓటమిగానో చుడటం లేదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: