రైతులకు సీఎం జగన్ శుభవార్త... సున్నా వడ్డీకే రుణాలు...?
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యవసాయ రంగంపై మేధోమథన సదస్సు నిర్వహించారు. 13 జిల్లాల నుంచి 24 మంది రైతులు మేధోమదన సదస్సుకు హాజరయ్యారు. రైతులకు సున్నా వడ్డీతో పంట రుణాలు ఇస్తామని సీఎం తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ రివ్యూ జరిపారు. నాలుగేళ్లకు బదులు ఐదేళ్లు రైతు భరోసా అమలు చేస్తామని... రైతులు నష్టపోకుండా పంటల బీమాలు అమలు చేస్తామని తెలిపారు.
పంటల బీమా కంపెనీలు డబ్బులు తీసుకోవడంలో ఆసక్తి చూపిస్తున్నాయని... డబ్బులు ఇచ్చే సమయంలో రైతులను ఇబ్బందులు పెడుతున్నాయని... అందువల్ల ప్రభుత్వమే రైతుల తరపున కట్టాల్సిన సొమ్మును ప్రభుత్వమే కట్టేలా మార్పులు చేసి 1270 కోట్ల రూపాయల ప్రీమియం కట్టామని తెలిపారు. పంట నష్టం జరిగితే వెంటనే సాయం జరిగేలా చేయనున్నామని తెలిపారు.