కర్నూలులో కరోనా తగ్గుముఖం.... జిల్లాలో జీరో కేసులు... కానీ ?

Reddy P Rajasekhar

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కర్నూలు జిల్లాలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ జిల్లాలో కొత్త కేసులు నమోదవుతూనే ఉండేవి. జిల్లాలో ఇప్పటివరకు 591 కరోనా కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 18కు చేరింది. గత 24 గంటల్లో జిల్లాలో కొత్త కేసులు నమోదు కాకపోయినా ఒకరు కరోనా భారీన పడి మృతి చెందారు. జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ప్రజలకు ఊరటనిచ్చే విషయమేనని చెప్పవచ్చు. 
 
మరోవైపు రాష్ట్రంలో ఈరోజు 36 కొత్త కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 15 కరోనా కేసులు నమోదు కాగా చిత్తూరు జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కాని శ్రీకాకుళం జిల్లాలో తాజాగా 2 కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులలో 21 కేసులకు కోయంబేడుతో లింక్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2100కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: