వలస కార్మికుల విషయంలో ఆలోచనలో పడ్డ తెలంగాణా...?

తెలంగాణా సర్కార్ వలస కార్మికులను అడ్డుకునే అవకాశాలు కనపడుతున్నాయి అనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణా లో కరోనా వైరస్ కేసులు రోజు రోజు కి మళ్ళీ పెరుగుతున్నాయి. ఈ కేసుల్లో ఎక్కువ భాగ౦ వలస కార్మికులకే వస్తున్నాయి. దీనితో ఇప్పుడు తెలంగాణా సర్కార్ అప్రమత్తమవుతుంది. 

 

వారి విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరమని భావిస్తూ వలస కార్మికులను నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చి ఏదైనా ఒక గ్రామంలో క్వారంటైన్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో తెలంగాణా సర్కార్ ఉంది. యాదాద్రి జిల్లాలో నాలుగు కేసులు రాగా మంచిర్యాల జిల్లాలో వారికి ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా తగ్గింది అని ఊపిరి పీల్చుకున్న సర్కార్ కి ఇది పెద్ద తల నొప్పిగా మారింది ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: